Hyderabad: కోకాపేట్‌లో యువకుడి హత్య

రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

By అంజి  Published on  16 Nov 2023 12:28 PM IST
murder, Kokapet, Crime news

Hyderabad: కోకాపేట్‌లో యువకుడి హత్య

రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మితిమీరిన ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందనిడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఇద్దరూ కార్మికుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన నయన్ పహారియా, రూబెల్ షేక్.. ఈ ఇద్దరు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఈ క్రమంలోనే కోకాపేటలోని ప్రెస్టీజ్ కన్స్ట్రక్షన్స్ లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రెస్టీజ్ కన్స్ట్రక్షన్స్ పదవ అంతస్తులో పనిచేస్తున్న సమయంలో ఈ ఇద్దరు యువకులు మధ్య ఘర్షణ చెలరేగింది. మాట మాట పెరగడంతో ఘర్షణ కాస్త పెద్దదైంది. అక్కడ పని చేస్తున్న మిగతా కార్మికులందరూ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా కూడా వినకుండా ఇద్దరు మధ్య ఘర్షణ తీవ్ర స్థాయిలో చెలరేగింది. దీంతో ఆగ్రహానికి లోనైనా రూబెల్ షేక్ తన పక్కనే ఉన్న రాడ్ తీసుకొని క్షణికా వేశంలో నయాన్ పహారియా తలపై గట్టి గట్టిగా బాదాడు.

దీంతో నయన్ తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన అనంతరం భయపడిపోయిన రూబెల్ షేక్ అక్కడినుండి పారిపోయాడు. కార్మికులందరూ చూస్తుండగానే వారి కళ్ళముందు నయాన్ ఒక్క సారిగా కుప్పకూలి కింద పడిపోయి మృతి చెందాడు. భయభ్రాంతులకు గురైన కార్మికులు వెంటనే 100 డయల్ కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని హత్య చేసి పారిపోయిన రూబెల్ షేక్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Next Story