అమ్మాయిల వీడియోలు తీయబోయి.. బిల్డింగ్‌పై నుంచి కింద పడి యువకుడి మృతి

A young man died after falling from a building in Secunderabad. అమ్మాయిల వీడియోను వారికి తెలియకుండా తీసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు

By అంజి  Published on  5 Sept 2022 7:11 AM IST
అమ్మాయిల వీడియోలు తీయబోయి.. బిల్డింగ్‌పై నుంచి కింద పడి యువకుడి మృతి

అమ్మాయిల వీడియోను వారికి తెలియకుండా తీసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఒక భవనంపై నుంచి మరో భవనంపైకి దూకే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్‌ పరిధిలోని చిలకలగూడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన దిలీప్‌ (24), బౌద్ధనగర్‌లో ఉన్న సాయి తేజ ఫ్రెండ్స్‌. శనివారం రాత్రి దిలీప్ సాయితేజ ఫ్లాట్‌కు వచ్చాడు. ఇద్దరు కలిసి ఫ్లాట్‌లో మద్యం సేవించారు.

ఈ క్రమంలోనే రాత్రి 1.15 గంటల సమయంలో దిలీప్‌ సిగరెట్‌ తాగడానికి బిల్డింగ్‌పైకి వెళ్లాడు. అదే బిల్డింగ్‌లోని మూడో అంతస్తులో గల ఫ్లాట్‌లో విండో దగ్గర ఒక అమ్మాయి చదువుకుంటూ, ఇంకో అమ్మాయి పడుకుని ఉండడాన్ని దిలీప్‌ గమనించాడు. తన స్మార్ట్‌ఫోన్‌లో ఆ అమ్మాయిలను వీడియో తీశాడు. ఈ విషయాన్ని చదువుకుంటున్న యువతి గమనించి వెంటనే.. బిల్డింగ్‌ కింద గణేష్‌ పండల్‌లో ఉన్న తన ఫ్రెండ్‌ ఉమేష్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. వెంటనే ఉమేష్‌ మరికొందరితో కలిసి మూడో అంతస్తుకు వెళ్లాడు.

వాళ్లను గమనించిన దిలీప్‌ అక్కడినుంచి తప్పించుకోవాలనుకున్నాడు. వెంటనే ఆ భవనంపైనుంచి పక్కనే ఉన్న మరో భవనంపైకి దూకేందుకు ప్రయత్నించి.. అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన దిలీప్‌ను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున దిలీప్‌ మృతిచెందాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story