AndhraPradesh: 'అన్నను చంపిందని'.. పగతో వదినను చంపిన మరిది

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గతంలో తన అన్న హత్యకు వదినే కారణమని...

By -  అంజి
Published on : 22 Dec 2025 11:41 AM IST

murder, Togalagallu village, Aspari mandal, Kurnool district, Crime

AndhraPradesh: 'అన్నను చంపిందని'.. పగతో వదినను చంపిన మరిది

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గతంలో తన అన్న హత్యకు వదినే కారణమని మనస్తాపం చెందిన మరిది, ఆమెపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే పగతో రగిలిపోతూ.. వదినను దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొగలగల్లు గ్రామానికి చంఎదిన గంగావతి (30).. మూడు నెలల కిందట తన భర్త అహోబిలాన్ని తన ప్రియుడితో కలిసి మర్డర్‌ చేయించింది. ఇటీవలే హత్య కేసులో సబ్‌ జైలుకి వెళ్లి వచ్చిన ఆమె గ్రామంలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తన అన్నను హత్య చేయించినందుకు వదినపై మరిది పెద్దయ్య కక్ష పెంచుకున్నాడు. ఆదివారం నాడు అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లి రోకలి బండతో కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story