హైదరాబాద్‌లోని లాడ్జిలో మహిళ హత్య

A woman was murdered in a lodge in Hyderabad city. హైదరాబాద్: అఫ్జల్‌గంజ్‌లోని ఓ లాడ్జిలో శనివారం రాత్రి ఓ మహిళను ఆమె భర్త గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన

By అంజి  Published on  2 Oct 2022 1:19 PM IST
హైదరాబాద్‌లోని లాడ్జిలో మహిళ హత్య

హైదరాబాద్: అఫ్జల్‌గంజ్‌లోని ఓ లాడ్జిలో శనివారం రాత్రి ఓ మహిళను ఆమె భర్త గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ, అరుణ దంపతులు అఫ్జల్‌గంజ్‌లోని మణికంఠ లాడ్జిలోకి వెళ్లారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఆ వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేసి గది నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న లాడ్జి నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లాడ్జీకి చేరుకున్న పోలీసులకు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల యూపీలో దారుణ ఘటన జరిగింది. త‌న భార్య‌తో వివాహేత‌ర సంబంధం క‌లిగి ఉన్నాడ‌నే అనుమానంతో ఓ వ్య‌క్తి త‌మ్ముడిని హ‌త్య చేశాడు. త‌మ్ముడిని హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ప‌రారీలో ఉన్న నిందితుడిని ధ‌నంజ‌య్ అలియాస్ పింటూ యాద‌వ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. త‌న త‌మ్ముడు శివ బ‌హదూర్ త‌న భార్య‌తో అక్ర‌మ సంబంధం న‌డుపుతున్నాడ‌నే అనుమానంతో తాను అత‌డిని అంత‌మొందించాన‌ని విచార‌ణ‌లో నిందితుడు అంగీక‌రించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 18న నిందితుడికి వివాహ‌మైందని పోలీసులు చెప్పారు.

Next Story