అద్దె ఇంట్లో దారుణం.. ప్లాస్టిక్ సంచిలో మహిళ మృతదేహం.. పరారీలో భర్త

A woman was found dead wrapped in a plastic cover in her rented house. ఓ అద్దె ఇంటిలో ప్లాస్టిక్‌ సంచిలో గొంతు కోసి చంపిన మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కేరళ కొచ్చిలోని కడవంతరలో వెలుగు

By అంజి  Published on  25 Oct 2022 10:04 AM GMT
అద్దె ఇంట్లో దారుణం.. ప్లాస్టిక్ సంచిలో మహిళ మృతదేహం.. పరారీలో భర్త

ఓ అద్దె ఇంటిలో ప్లాస్టిక్‌ సంచిలో గొంతు కోసి చంపిన మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కేరళ కొచ్చిలోని కడవంతరలో వెలుగు చూసింది. మహిళను దారుణ హత్య చేసి ప్లాస్టిక్‌ సంచిలో కప్పి పెట్టి ఉంచారు. అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి ఓ రకమైన దుర్వాసన వస్తోందని స్థానికులు ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ప్లాస్టిక్‌ సంచిలో మహిళ మృతదేహం కనబడింది. మహిళను హత్య చేసి నాలుగు రోజులకు పైగానే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మృతురాలిని మహారాష్ట్ర వాసి లక్ష్మి (30)గా గుర్తించారు. అయితే ఇంటి యజమానికి ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ సమర్పించకపోవడంతో మృతురాలి చిరునామాను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మృతి చెందిన మహిళ తన భర్త రామ్ బహదూర్‌తో కలిసి నివసిస్తుండేది. మహిళ హత్యా ఘటన తర్వాత రామ్‌ బహదూర్‌ కనిపించకుండా పోయాడు. ''అద్దె ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానిక కౌన్సిలర్ మాకు తెలియజేసారు. మేము ఇంటికి వచ్చేసరికి బయటి నుంచి తాళం వేసి ఉన్న బెడ్‌రూమ్‌లో మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌తో పాటు బెడ్‌క్లాత్‌లో చుట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇది స్పష్టమైన హత్య కేసు. మృతురాలి భర్త ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు" అని కొచ్చిలోని ఎస్‌హెచ్‌ఓ సౌత్ పోలీస్ స్టేషన్‌లోని ఫైసల్ ఎంఎస్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. "వారు గత ఏడాదిన్నర కాలంగా ఇక్కడే ఉంటున్నారు. తమను తాము మహారాష్ట్ర వాసులుగా ఇంటి యజమానికి పరిచయం చేసుకున్నారు. వారు ఐడీ రుజువును అందించనందున, వారి ఖచ్చితమైన వివరాలు మాకు తెలియవు. వాటిని పొందడానికి దర్యాప్తు చేయాలి." అధికారి చెప్పారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ''గత 2-3 రోజులుగా వారు కనిపించడం లేదని ఇంటి యజమాని,సమీపంలోని నివాసితులు మాకు సమాచారం అందించారు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉన్నందున, హత్య గురువారం లేదా శుక్రవారం జరిగి ఉండవచ్చు. మేము పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం'' అని అధికారి తెలిపారు.

మరోవైపు భర్త ఆచూకీ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. "మేము ఇప్పటికే ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని తనిఖీ చేయడం ప్రారంభించాము. త్వరలో అతన్ని కనుగొనగలమని మేము ఆశిస్తున్నాము" అని అధికారి తెలిపారు.

Next Story