అక్రమంగా మద్యం అమ్మొద్దని కోరిన వార్డు మెంబర్ ను హత్య చేసిన మహిళ

A woman killed a ward member who asked him not to sell liquor illegally in Tamil Nadu. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 31 ఏళ్ల ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) వార్డు మెంబర్‌ను ఓ మహిళ హత్య చేసింది.

By Medi Samrat  Published on  20 Sept 2022 2:00 PM IST
అక్రమంగా మద్యం అమ్మొద్దని కోరిన వార్డు మెంబర్ ను హత్య చేసిన మహిళ

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 31 ఏళ్ల ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) వార్డు మెంబర్‌ను ఓ మహిళ హత్య చేసింది. అక్రమంగా మద్యం అమ్మవద్దని కోరినందుకు ఓ మహిళ అతడిని హత్య చేసింది. లోకేశ్వరి అలియాస్ ఎస్తేర్‌గా గుర్తించిన నిందితురాలు తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్మాక్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి తన ఇంట్లో అక్రమంగా విక్రయిస్తుండేది. డిఎంకె వార్డు సభ్యుడు సతీష్ అనే వ్యక్తి ఎస్తేర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె తన వార్డులలో మద్యం అమ్మకుండా అడ్డుకున్నాడు.

నిందితురాలు సతీష్‌ని మాట్లాడుకుందామని తన ఇంటికి ఆహ్వానించి కొడవలితో హత్య చేసింది. ఆమె అతని తలపై దాడి చేసి, అతని మృతదేహాన్ని తన ఇంటి బయట పారేసింది. దీనిపై ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు, వారు మృతదేహాన్ని వెలికితీసి, ఎస్తేర్ ఇంటిలో రక్తపు జాడను గుర్తించారు. సోమంగళం పోలీసులు విచారణ ప్రారంభించి ఎస్తేర్ కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story