భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చి పెట్టిన భార్య.. అతడి కోసమే
A wife who killed her husband and buried him in a septic tank. నోయిడాలో దారుణ ఘటన జరిగింది. ఓ భార్య.. తన భర్తను కిరాతకంగా చంపి పక్కనే
By అంజి Published on 16 Jan 2023 3:00 AM GMTనోయిడాలో దారుణ ఘటన జరిగింది. ఓ భార్య.. తన భర్తను కిరాతకంగా చంపి పక్కనే నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చి పెట్టింది. జనవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని బులందర్ శహర్‌కు చెందిన సతీష్‌కు భార్య నీతూ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. రెండేళ్ల కిందట వీరూ నోయిడాకు వచ్చారు. సరస్వతి కుంజ్‌లో సొంతింటి నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణం కోసం తాపీ మెస్త్రీ హర్పాల్ అనే వ్యక్తితో డీల్ మాట్లాడుకున్నారు.
రోజులు గడుస్తున్నాయి. ఓ వైపు ఇల్లు నిర్మాణం జరుగుతోంది. అదే సమయంలో తాపీ మెస్త్రీతో సతీష్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడిపై మోజుతో తన భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. జనవరి 2వ తేదీన భర్త సతీష్ మద్యం మత్తులో ఉండటంతో భార్య తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంటి పక్కనే నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చి పెట్టారు.
ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఆ మహిళ తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు, నేరంలో తన పాత్ర నుంచి దృష్టి మరల్చేందుకే మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో ఓ కేరళ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తమ తల్లి ఎవరితోనో పారిపోయిందని, కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని ఇతరులకు చెప్పవద్దని పిల్లలతో చెప్పాడు. హత్య జరిగిన 17 నెలల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇలాంటిదే మరో కేసులో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఓ భర్త తన భార్యకు విద్యుదాఘాతంతో హత్య చేసి మృతదేహాన్ని తన బెడ్‌రూమ్‌లో పాతిపెట్టాడు. నిందితుడి తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆమె తన కోడలు గురించి ఆరా తీసింది. ఆమె కొడుకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. అనంతరం హత్యా నేరం కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.