యాదాద్రి జిల్లాలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. సినిమా స్టైల్లో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.

By అంజి
Published on : 15 July 2025 9:32 AM IST

murder, Yadadri district, Crime, Katepalli

యాదాద్రి జిల్లాలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆపై..

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. సినీ ఫక్కీలో భర్తను హత్య చేయించిన భార్య.. ఆ తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం నాడు కాటేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. మార్నింగ్‌ టైమ్‌లో బైక్‌పై వెళ్తున్న స్వామిని వెనుక నుండి కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన స్వామిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులకు ఈ ప్రమాదంపై అనుమానం వ్యక్తం లోతుగా దర్యాప్తు చేయగా.. హత్య కోణం బయటపడింది.

పోలీసుల విచారణలో భార్యనే తన భర్త హత్యకు ప్రణాళిక రూపొందించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితురాలు కారును రెంట్‌కు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒకసారి ఢీకొట్టిన తర్వాత స్వామి చనిపోక పోతే మరోసారి అతడి మీద నుండి కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. స్వామి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దారుణం బయటపడింది. స్వామి భార్యతో పాటు బామ్మర్ది, సుఫారీ కిల్లర్స్ ని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story