ఎన్టీఆర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం నాడు జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద రోడ్డుపై వేగంగా వచ్చిన కారు కార్మికులపై నుంచి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అవనిగడ్డకు చెందిన భాస్కర్ (21), సుధాకర్ (21)లు చల్లపల్లి వెళ్తుండగా ఈ ఘటనలో దుర్మరణం చెందారు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.