తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు.. నరాలు కోసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చంపేశారు

A software employee was brutally murdered in Khammam district. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమనడమే ఆ యువకుడి తప్పైంది. తీసుకున్న డబ్బును తిరిగి అడుగుతున్నాడని

By అంజి  Published on  12 Dec 2022 9:16 AM IST
తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు.. నరాలు కోసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చంపేశారు

ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమనడమే ఆ యువకుడి తప్పైంది. తీసుకున్న డబ్బును తిరిగి అడుగుతున్నాడని యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఆదివారం నాడు జరిగింది. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌ పంచాయతీలోని శాంతినగర్‌కు చెందిన ధారావత్ అశోక్‌ కుమార్‌ (24).. ఖమ్మంలోని ఓ ఐటీ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. తండ్రి ధారావత్‌ బాలాజా బీజేపీ మండల అధ్యక్షుడు. అశోక్కు భార్య అమల, రెండు నెలల పాప ఉంది.

ముత్యాలంపాడుక చెందిన గుగులోత్‌ ప్రేమ్‌కుమార్‌కు అడిగినప్పుడల్లా అశోక్‌ అప్పు ఇచ్చేవాడు. అలా రూ.80 వేల వరకు ఇచ్చాడు. ప్రేమ్‌కుమార్‌ మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా అశోక్‌ అప్పు ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వారిని డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాడు. దీంతో వారు అశోక్‌పై కక్ష పెంచుకున్నారు. అతడిని హత్య చేయాలని ప్లాన్‌ చేశారు. అందులో భాగంగానే శనివారం రాత్రి డబ్బులు ఇస్తాం అని చెప్పి అశోక్‌కు చెప్పారు. దీంతో అతడు బైక్‌పై ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు చేరుకున్నాడు.

ఆ తర్వాత అశోక్‌ను స్థానిక పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గొంతు, చేతిమణికట్లు, కాలి చీలమండల నరాలు కోసి అతి క్రూరంగా హత్య చేశారు. ఉదయం కావస్తున్నా అశోక్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అశోక్‌ తండ్రి బాలాజీ ఫిర్యాదుపై టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు. ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Next Story