5 సంవత్సరాలుగా ఇంటికి తాళం.. తెరచి చూసిన ప్రతి ఒక్కరి ఫ్యూజులూ..!

A shocking incident is coming out of Bihar.బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలోని సర్మెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక

By M.S.R  Published on  16 Feb 2022 7:33 AM GMT
5 సంవత్సరాలుగా ఇంటికి తాళం.. తెరచి చూసిన ప్రతి ఒక్కరి ఫ్యూజులూ..!

బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలోని సర్మెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామం లో ఓ ఇల్లు 5-6 సంవత్సరాలుగా మూసి ఉంది. ఇటీవల తలుపు తీయగా.. ఒక్కసారిగా లోపల కనిపించింది చూసి అందరూ షాకయ్యారు. ఆ ఇంటి నుండి అస్థిపంజరం కనుగొనబడింది. గ్రామంతో సహా పరిసర ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది ఈ ఘటన. స్వాధీనం చేసుకున్న అస్థిపంజరాన్ని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పాట్నాకు తరలించారు.

అస్థిపంజరాన్ని కనుగొన్న ఇల్లు గత 5 నుండి 6 సంవత్సరాలుగా మూసివేయబడిందని అదే పోలీసు అధికారి చెప్పారు. సర్మెర స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ వివేక్‌ రాజ్‌ మాట్లాడుతూ.. నారో కాబ్లర్‌ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి ఢిల్లీలో కూలీగా పనిచేస్తున్నాడని తెలిపారు. దీంతో మీర్‌నగర్‌ గ్రామంలో ఉన్న ఈ ఇంటికి తాళం వేసి ఉంది. నారో తన కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి సుమారు 5 సంవత్సరాల తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి రాగానే ఆ ఇంటి లోపల ఘాటైన వాసన వచ్చింది. అతను వెతకడం ప్రారంభించగా శిధిలమైన గది నుండి తీవ్రమైన దుర్వాసన వెలువడింది. అక్కడ మట్టిని తవ్వగా దుర్గంధం మరీ ఎక్కువ అవ్వడంతో.. కుటుంబంలో కలకలం రేగింది. అనంతరం గ్రామస్తులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అస్థిపంజరాన్ని అక్కడి నుండి తరలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే ఏంటో తెలుస్తుందని, తదుపరి విచారణ జరుపుతామని స్టేషన్ ఇన్ చార్జి తెలిపారు.

Next Story
Share it