Anantapur: దంపతులపై పెట్రోలు పోసి నిప్పంటించిన బంధువు

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం జరిగింది. మండలం సజ్జలదిన్నెలో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దంపతులపై

By అంజి  Published on  18 Jun 2023 10:29 AM IST
couple, fire, Tadipatri, Anantapur district

Anantapur: దంపతులపై పెట్రోలు పోసి నిప్పంటించిన బంధువు

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం జరిగింది. మండలం సజ్జలదిన్నెలో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎల్లనూరు మండలం వేములపల్లెకు చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణమ్మ గత కొన్నేళ్లుగా తాడిపత్రి పరిధిలోని సజ్జలదిన్నెలోని చుక్కలూరు రోడ్లో వున్న శ్రీనిధి నల్ల బండల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరి సమీప బంధువు అదే పరిశ్రమలో పనిచేస్తున్న రామన్‌రెడ్డి మద్యానికి బానిస కావడంతో నల్లపురెడ్డి గత మూడు రోజులుగా మందలించాడు.

ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి బయట మంచంపై నిద్రిస్తున్న నల్లపురెడ్డి, కృష్ణవేణిలపై రామెన్ రెడ్డి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దంపతులతో పాటు అక్కడే నిద్రిస్తున్న ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు దంపతులను తాడిపత్రి ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story