వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తే.. పదోపరకు ఆదాయం వస్తుందని, పంటతోపాటు పంట చేనులో గంజాయి మొక్కలు సాగిస్తే లక్షల లాభం గడించవచ్చునని భావించిన వ్యక్తికి సంగారెడ్డిలో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 25000 జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోని గ్రామంలో మంగలి వెంకటేశం అనే వ్యక్తి గంజాయి సాగు చేశాడు. 2018 నవంబర్ 6న ఎక్సైజ్ సీఐ మధుబాబు సిబ్బందితో దాడి చేసి 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి సాగు చేసిన వ్యక్తిపై నమోదు చేసిన కేసు శనివారం సంగారెడ్డి జిల్లాలోని ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ట్ న్యాయమూర్తి శ్రీమతి జయంతి గంజాయి సాగు వెంకటేశ్వర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
గంజాయి సాగు చేసిన వ్యక్తికి శిక్ష పడడానికి అన్ని రకాల చర్యలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ మధుబాబు తో పాటు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలహాసన్ రెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కే ఏ బి శాస్త్రి, అభినందించారు.