బాలికను కిడ్నాప్‌ చేసిన పెయింటర్‌.. బలవంతంగా పెళ్లి చేసుకుని.. ఆపై లైంగిక వేధింపులు

A painter who kidnapped a girl in Tamil Nadu, forced her into marriage and then sexually assaulted her. తమిళనాడులోని సేలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేశాడో యువకుడు.

By అంజి  Published on  13 Sept 2022 2:04 PM IST
బాలికను కిడ్నాప్‌ చేసిన పెయింటర్‌.. బలవంతంగా పెళ్లి చేసుకుని.. ఆపై లైంగిక వేధింపులు

తమిళనాడులోని సేలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేశాడో యువకుడు. ఆ తర్వాత బాలికను ఓ ఆలయంలో బలవంతంగా పెళ్లి చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రంగనాథన్‌ (26) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ఇన నెలల క్రితం మైనర్‌ బాలికతో ప్రేమలో పడ్డాడు. అనంతరం నిందితుడు పథకం పన్ని సెప్టెంబర్ 5న ఆమెను కిడ్నాప్ చేశాడు.

బాలికతో కలిసి స్వగ్రామమైన సేలం వెళ్లి అక్కడ ఆమెను గుడిలో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరూ ఓ ఇంట్లోనే ఉంటున్నారని, ఆమెపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 10న సేలంలోని బస్టాప్‌లో రంగనాథన్‌తో ఉన్న బాలికను గుర్తించిన పోలీసు అధికారులు వారిద్దరినీ అరెస్టు చేశారు.

నిందితుడు తనను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక పోలీసులకు తెలిపింది. దీని ఆధారంగా పోలీసులు పెయింటర్‌ను భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. బాలికను పోలీసు అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు.

Next Story