యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో భవ్య, వైష్ణవి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత వీరిది ఆత్మహత్యగా భావించినా.. తాజాగా మృతదేహాలపై గాయాలు, పంటిగాట్లు ఉండటం పలు అనుమానాలకు తెరలేపింది. హాస్టల్ వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవరుతో సంబంధం ఉండగా ఆ విషయం భవ్య, వైష్ణవిలకు విషయం తెలిసి పోవడంతో వారిని వార్డెన్ వేధించిందని సమాచారం. ''మా మేడం శైలజ మంచిది''.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అంటూ అనుమానపు సూసైడ్ లెటర్‌లో ఉంది.
ఈ క్రమంలోనే ఆ ఇద్దరిని హత్య చేసి ఫేక్ సూసైడ్ లెటర్ సృష్టించారని తల్లితండ్రులు ఆరోపించారు. ఈ కేసులో వార్డెన్ శైలజతో పాటు వంట మనుషులు, పీఈటీ, ట్యూషన్ టీచర్, ఓ ఆటో డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ కూతుళ్లది హత్యేనంటూ బాలికల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టును, పోలీసులు పంచానామాను బయటపెట్టాలని కోరుతూ భువనగిరి పట్టణం లోని ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనితో హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన హాస్టల్ దగ్గరకి చేరుకున్నారు.