హాస్టల్‌లో మైనర్ బాలుడిపై లైంగిక దాడి

A minor boy was sexually assaulted in a school hostel in Haryana. హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఝజ్జర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల హాస్టల్‌లో మైనర్‌ బాలుడిపై

By అంజి  Published on  21 Aug 2022 4:01 PM IST
హాస్టల్‌లో మైనర్ బాలుడిపై లైంగిక దాడి

హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఝజ్జర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల హాస్టల్‌లో మైనర్‌ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడి అసహజ శృంగారంతో చిత్రహింసలకు గురి చేశారు. బాలుడి తల్లిదండ్రుల వాంగ్మూలం ఆధారంగా ఝజ్జర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిదేళ్ల బాలుడు ఝజ్జర్-గురుగ్రామ్ రోడ్‌లోని ప్రైవేట్ పాఠశాలలోని హాస్టల్‌లో చదువుకుంటున్నాడు. వేధింపుల గురించి బాలుడు తన తండ్రికి చెప్పాడు.

దీంతో చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. ఝజ్జర్ డీఎస్పీ రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. తాము పాఠశాల అధికారుల నుండి హాస్టల్ ప్రాంగణంలోని సీసీ ఫుటేజీ సేకరించి పరిశీలిస్తున్నామని చెప్పారు. బాలుడి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వసీం అక్రమ్ తెలిపారు. అనుమానితులను ఇంకా గుర్తించలేదని, అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అని అతను చెప్పాడు.

Next Story