తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపి..

గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

By అంజి  Published on  15 Feb 2024 1:30 PM IST
married woman, murder, Tenali, Crime news

తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపి..

గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న రామిశెట్టి అలేఖ్య (35)ను గొంతు కోసి చంపేశారు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న అలేఖ్య డెడ్‌బాడీని చూసిన ఆమె భర్త రమేశ్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. అయితే కొన్నేళ్లుగా అన్నెం శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడని, కేసులు కూడా పెట్టామని మృతురాలి భర్త రమేశ్‌ పోలీసులకు చెప్పాడు.

తన భార్యను అన్నెం శ్రీనివాస్‌ తరచూ వేధించేవాడని, ఆమెపై గతంలో హత్యాయత్నం కూడా చేశాడని చెప్పాడు. తమను కూడా పలుమార్లు చంపుతామని బెదిరించాడని, అతడిపై కేసులు పెట్టాం, శిక్ష పడే అవకాశం ఉండటంతోనే ఇలా చేశాడని మృతురాలి భర్త పోలీసులకు వివరించాడు. బెదిరింపులతో ఆగుతాడని అనుకున్నామని, కానీ అతడు ఇంతటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదన్నాడు. పదునైన ఆయుధంతో గొంతు కోయడంతోనే అలేఖ్య చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన విధానం చూస్తుంటే.. తెలిసిన వ్యక్తులే ఇది చేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story