బాలాపూర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 11 Jan 2024 10:16 AM ISTబాలాపూర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా వెళ్తున్న రౌడీషీటర్‌పై కొంత మంది వ్యక్తులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి అతని శరీరాన్ని పలుమార్లు కత్తులతో పొడవడమే కాకుండా అతని మర్మాంగాలు కట్ చేసి అతికిరాతకంగా హత్య చేసి అక్కడి నుండి పారిపోయారు.
రక్తపు మడుగులో పడి ఉన్న రౌడీ షీటర్ మృతదేహాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు బాలాపూర్ ప్రాంతానికి చెందిన ముబారక్ సిగార్ అనే రౌడీషీటర్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలు నేపథ్యంలోనే హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై బాలాపూర్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.