పెళ్లికి నిరాకరించిందని.. సహోద్యోగిని కత్తితో పొడిచిన యువకుడు

A man stabbed a female colleague in Thane after she refused to marry him. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు సహోద్యోగిపై కత్తితో దాడి చేసినందుకు ఓ వ్యక్తిపై హత్యాయత్నం

By అంజి  Published on  22 Sep 2022 12:11 PM GMT
పెళ్లికి నిరాకరించిందని.. సహోద్యోగిని కత్తితో పొడిచిన యువకుడు

తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు సహోద్యోగిపై కత్తితో దాడి చేసినందుకు ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 27 ఏళ్ల యువతి చికిత్స పొందుతుండగా నిందితుడు యోగేష్ కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వివాహిత అయిన మహిళ గత మూడేళ్లుగా భర్తకు దూరంగా జీవిస్తోంది. మహిళ కలంబోలి ప్రాంతంలోని ఓ సంస్థలో పనిచేస్తోందని షిల్-దైఘర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సచిన్ గావ్డే తెలిపారు.

అదే కంపెనీలో పని చేస్తున్న కుమార్ మహిళకు గతంలో పెళ్లి ప్రపోజ్ చేశాడని, అయితే ఆ మహిళ నిరాకరించిందని తెలిపారు. మంగళవారం అతను ఆమెను బైక్‌పై ఇంటికి తీసుకెళ్తానని చెప్పి, ఉత్తరశివ్ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారి తెలిపారు. మార్గమధ్యంలో బైక్‌ను ఆపి మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. తనకు ఇదివరకే పెళ్లయిందని మహిళ గట్టిగా చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన కుమార్ అక్కడి నుంచి పారిపోయే ముందు కత్తి తీసి ఆమెను పొడిచాడు. కడుపులో, ముఖంపై గాయాలతో ఉన్న మహిళ ఆటో రిక్షా ఎక్కి కాల్వ సివిల్ ఆసుపత్రికి చేరుకుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

కుమార్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారని అధికారి తెలిపారు.

Next Story
Share it