జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్య వివాహేతర సంబంధం నడుపుతోందని.. కోపంతో బతికి ఉండగానే కన్నకూతురికిని నిప్పటించాడో తండ్రి. కిస్కో పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్నాగ్ అనే గ్రామంలో ఓ వ్యక్తి తన 4 ఏళ్ల కుమార్తెకు నిప్పంటించాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పప్పు టూరి అనే వ్యక్తి తన భార్యతో కొంత గొడవ తర్వాత ఈ నేరానికి పాల్పడ్డాడని స్థానిక నివాసి ఒకరు తెలిపారు.
''వాగ్వాదం తర్వాత వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. భార్య తప్పించుకోగలిగింది. ఆమెపై కోపంతో తన 4 సంవత్సరాల కుమార్తెపై కిరోసిన్ నూనె పోసి నిప్పంటించాడు. నేరం చేసిన తర్వాత ఆ వ్యక్తి పరారయ్యాడు. అనంతరం గ్రామస్తులు బాలికను రక్షించారు. బాలికకు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బాలికను తరువాత రిమ్స్ రాంచీకి రెఫర్ చేశారు'' అని స్థానిక నివాసి చెప్పారు.
వాగ్వాదానికి గల కారణాన్ని అడిగినప్పుడు.. "ఆ వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధంపై అనుమానంతో ఉన్నాడు." అని చెప్పాడు. కిస్కో ఏరియా ఇన్‌స్పెక్టర్ మంతు కుమార్ ఈ సంఘటనను ధృవీకరించారు. అయితే ఈ సంఘటన వెనుక కారణాన్ని చెప్పడంలో పోలీసులు తమ అసమర్థత ప్రదర్శించారు. ''ఆ వ్యక్తి నేరం చేసినప్పుడు తాగి ఉన్నాడు. ఘటన అనంతరం అతడు పరారయ్యాడు. మేము అతని కోసం వెతుకుతున్నాము. మేము అతనిని పట్టుకుని అతని వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత, సంఘటన వెనుక ఉన్న కారణాలపై మేము వ్యాఖ్యానించగలము'' అని ఇన్స్పెక్టర్ కుమార్ చెప్పారు.