19 ఏళ్ల బాలిక కిడ్నాప్‌.. కట్టేసి అత్యాచారం.. వీడియో రికార్డ్

కేరళలో దారుణం జరిగింది. కోజికోడ్‌లోని తొట్టిల్‌పాలెం సమీపంలోని ఓ ఇంట్లో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని యువకుడు కిడ్నాప్‌ చేశాడు.

By అంజి  Published on  27 Aug 2023 10:58 AM IST
Kerala man, Crime news, Thottilpalam , Kozhikode

19 ఏళ్ల బాలిక కిడ్నాప్‌.. కట్టేసి అత్యాచారం.. వీడియో రికార్డ్

కేరళలో దారుణం జరిగింది. కోజికోడ్‌లోని తొట్టిల్‌పాలెం సమీపంలోని ఓ ఇంట్లో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని యువకుడు కిడ్నాప్‌ చేశాడు. ఆమెను ఓ ఇంట్లో కట్టేసి వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. కాగా మూడు రోజుల తర్వాత నిందితుడు జునైద్ (26)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అపహరణ, అత్యాచారం ఆరోపణల కింద జునైద్‌ను ఆగస్టు 26, శనివారం నాడు అరెస్టు చేశారు. ఆగస్ట్ 23 బుధవారం నాదాపురం నుంచి యువతి అదృశ్యమయ్యింది. ఒక రోజు తరువాత ఆమె జునైద్ యాజమాన్యంలోని ఒక నిర్జన ఇంట్లో కనుగొనబడింది. ఇంట్లో నుంచి 5.7 గ్రాముల ఎండీఎంఏను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జునైద్ కొద్దిరోజుల క్రితమే యూఏఈ నుంచి తిరిగొచ్చాడని, అతని తల్లిదండ్రులు విదేశాల్లో ఉండడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.

ఆగస్ట్ 25, శుక్రవారం జునైద్ కోసం నాదాపురం పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ తొట్టిలపాలెంలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిరసనలు కూడా జరిగాయి. బాలిక తప్పిపోయిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసి ఇంట్లోకి వెళ్లి ఆమెను రక్షించారు. ఆమెను చికిత్స నిమిత్తం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. నిందితులు తనను బెదిరించి, అపహరించి, అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. జునైద్ నేరాన్ని చిత్రీకరించాడని కూడా ఆమె చెప్పింది. నాదాపురం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం జునైద్‌ను ప్రశ్నిస్తోంది. ఈ నేరంలో మరికొంత మంది ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story