ప్రియురాలిని చంపిన జర్నలిస్ట్.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. ఏం చేశాడో తెలిస్తే షాకే.!
A journalist who brutally murdered his girlfriend was arrested. ప్రియురాలిని ఓ జర్నలిస్ట్ అతి కిరాతంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు.
By అంజి Published on 19 Aug 2022 10:29 AM ISTప్రియురాలిని ఓ జర్నలిస్ట్ అతి కిరాతంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 24 ఏళ్ల మహిళకు ముగ్గురు పిల్లలు. ఇది వరకు ఆమె షియుర్ ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవలే ఆమె తన కుటుంబాన్ని వదిలిపెట్టి హుడ్‌కో ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకుంది. 35 ఏళ్ల సౌరభ్ లాఖే అనే వ్యక్తితో మహిళ కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుపుతోంది. సౌరభ్ స్థానికంగా ఫ్రీలాన్స్ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు.
24 ఏళ్ల మహిళ.. కొన్ని రోజుల క్రితం వరకు షియుర్ ప్రాంతంలో నివాసముండేది. ఆమెకు ముగ్గురు పిల్లలు. కాగా.. ఇటీవలే.. కుటుంబాన్ని విడిచిపెట్టి హుడ్‌కో ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంది. హుడ్కోలోని మహిళ ఇంటికి సౌరభ్ తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే తాను ఇంట్లో నుంచి వచ్చేశానని, తనని పెళ్లిచేసుకోవాలని సౌరభ్‌కు ఆ మహిళ అనేకమార్లు చెప్పింది. పెళ్లి విషయాన్ని మాత్రం అతడు పట్టించుకోలేదు. మహిళ సౌరభ్‌ను పెళ్లి చేసుకోవాలని పదే పదే అడగడటంతో.. అతడు విసిగిపోయాడు.
ఎలాగైన మహిళను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను చంపేందుకు ప్లాన్ గీశాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సం నాడు.. ఆ మహిళ నివాసానికి వెళ్లిన సౌరభ్.. ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం చేసిన నేరం బయటపడకుండా చూసుకునేందుకు మరో ప్రణాళిక రచించాడు. మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. నరికిన శరీర భాగాలను వేరుచేశాడు. తర్వాతి రోజు మహిళ తల, చేతులను బ్యాగులో పెట్టుకుని షియుర్లోని ఓ గోడౌన్లో పడేశాడు. మరుసటి రోజు కూడా ఇతర శరీర భాగాలను తరలించే ప్రయత్నం చేశాడు.
అదే సమయంలో ఇంటి ఓనర్.. సౌరభ్‌ను గమనించాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. షియుర్కు వెళుతున్న సౌరభ్‌ను.. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సౌరభ్‌పై విచారణ చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. ప్రియురాలి హత్య, సాక్ష్యాలను నాశనం చేసేందుకే శరీర భాగాలను నిందితుడు నరికాడని పోలీసులు తెలిపారు.