బురఖా ధరించడం లేదని.. భార్యని గొంతు కోసి చంపిన భర్త

A husband who strangled his wife for not wearing a burqa.. An incident in Mumbai. ముస్లిం ఆచారాలు పాటించడం లేదని, బురఖా ధరించడానికి నిరాకరించిందన్న

By అంజి  Published on  27 Sep 2022 8:39 AM GMT
బురఖా ధరించడం లేదని.. భార్యని గొంతు కోసి చంపిన భర్త

ముస్లిం ఆచారాలు పాటించడం లేదని, బురఖా ధరించడానికి నిరాకరించిందన్న కారణంతో ముంబైలో ఓ వ్యక్తి తన హిందూ భార్యను హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఇక్బాల్ మహమూద్ షేక్ అనే వ్యక్తి తన హిందూ భార్య రూపాలి ముస్లిం ఆచారాలను పాటించడం లేదని సోమవారం రాత్రి హత్య చేశాడు. అంతకుముందు భార్య రూపాలి ఇక్బాల్ నుండి విడాకులు కోరింది. పిల్లల సంరక్షణ గురించి మాట్లాడుతూ ఆమెను ఓప్పించడం ప్రారంభించాడు. అయినా వినకపోవడంతో కోపోద్రిక్తుడైన ఇక్బాల్ దారుణ హత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం తిలక్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.

హత్యకేసు నిందితుడు ఇక్బాల్ షేక్, రూపాలి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె ఇక్బాల్ ఇంటికి వచ్చింది. రూపాలి హిందువు. వివాహం తర్వాత కూడా ఆమె ముస్లిం ఆచారాలను పాటించలేదు. దీంతో ఇక్బాల్‌తో పాటు అతని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాలి బురఖా ధరించాలని అతని వైపు నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ రూపాలి అతని మాట వినకపోవడంతో కుటుంబంలో రోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే ఇక్బాల్ కుటుంబ సభ్యుల ఒత్తిడి, గొడవల కారణంగా, రూపాలి ఆరు నెలల క్రితం విడిగా జీవించడం ప్రారంభించింది.

ఈ సమయంలో కూడా ఇక్బాల్, రూపాలీ ఫోన్‌లో మాట్లాడుకోవడం కొనసాగించారు. కానీ ముస్లిం ఆచారాలను అనుసరించడం గురించి ఇద్దరి మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరిగేది. ఇక్బాల్ షేక్ సోమవారం సాయంత్రం చెంబూర్‌లోని పిఎల్ లోఖండే మార్గ్‌లోని నాగేవాడి వద్ద తనను కలవాలని రూపాలికి ఫోన్ చేశాడు. కలిసిన సందర్భంగా.. రూపాలి ఇక్బాల్‌తో విడాకులు కోరింది. అయితే తన కుమారుడిని గురించి చెబుతూ.. తాను విడాకులు తీసుకోనని ఇక్బాల్ చెప్పాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్బాల్ రుపాలి గొంతు కోసి పరారయ్యాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రూపాలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిలక్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూపాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజావాడి ఆసుపత్రికి తరలించారు. తిలక్ నగర్ పోలీసులు నిందితుడు ఇక్బాల్‌ను వెంటనే అరెస్ట్ చేశారు. రూపాలి, ఇక్బాల్‌ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రూపాలి ఇక్బాల్ రెండవ భార్య. పిల్లలు లేని కారణంగా ఇక్బాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.

Next Story