Kurnool: స్కూల్ టీచర్ ఆత్మహత్య.. బ్లేడ్‌తో చేతి నరాలు కోసుకుని..
కర్నూలు జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను బస చేసిన లాడ్జి గదిలోనే బ్లేడ్‌తో చేతి నరాలు కోసుకుని ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 24 March 2024 2:43 AM GMTKurnool: స్కూల్ టీచర్ ఆత్మహత్య.. బ్లేడ్‌తో చేతి నరాలు కోసుకుని..
కర్నూలు జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్ శర్మ (49) ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను బస చేసిన లాడ్జి గదిలోనే బ్లేడ్‌తో చేతి నరాలు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం నొస్సం గ్రామానికి చెందిన రాజశేఖర్‌శర్మ ఉద్యోగ రీత్యా కర్నూలులోని స్కంద లోటస్ విల్లాస్‌లో తన కుటుంబంతో ఉంటున్నాడు. గోనెగండ్ల మండలంలోని పుట్టపాశం గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్‌లో లెక్కట టీచర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రమాదేవితో, కొడుకు రిషికుమార్ ఉన్నాడు. కొడుకు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.
తాను పని చేస్తున్న స్కూల్‌లో విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు రాజశేఖర్‌శర్మను ఇటీవల సస్పెండ్ చేశారు. ఈ నెల 21న ఎప్పటిలాగే రాజశేఖర్‌శర్మ స్కూల్‌కు వెళ్లాడు. తనకు సస్పెండ్ నోటీసులు వచ్చాయని తెలుసుకుని ఇంటికి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం రాజశేఖర్‌శర్మ మా సార్ పిలుస్తున్నాడు.. బస్టాండు వరకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. చివరకు కర్నూలులోని 4వ పట్టణ పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే రాజశేఖర్‌శర్మ 21న కర్నూలు నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి, అక్కడే ఓ లాడ్జికి వెళ్లి రాత్రి అక్కడే పడుకున్నాడు.
3 రోజులుగా అతను లాడ్జిలోనే ఉన్నాడు. శనివారం నాడు చేతులకు రక్తం కార్చుకుంటూ లాడ్జి గదిలో నుంచి బయటికి వచ్చాడు. రక్తంతో ఉన్న అతన్ని చూసి లాడ్జి నిర్వాహకులు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్ వచ్చే లోపే అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ అబ్దుల్‌కరీం సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రెండు చేతుల నరాలను కోసుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావమై అతను చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు రాసుకున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన తప్పు లేకున్నా అన్యాయంగా సస్పెండ్ చేశారని సూసైడ్ నోట్‌లో వెల్లడించాడు. ''చిన్న పిల్లల చేత ఉపాధ్యాయులు నాపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు.. ఇది చాలా అన్యాయం సార్. నేను ఏ తప్పు చేయలేదు'' అని రాజశేఖర్‌శర్మ సూసైడ్ నోట్‌లో రాసుకున్నారు.