నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లగొండ జిల్లాకు చెందిన రోహిత్(21) బీబీఏ సెకండియర్ చదవుతున్నాడు. నవ్య అనే విద్యార్థినిని ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. రోహిత్ ప్రేమ ప్రతిపాదనను గత ఏడు నెలల నుంచి నవ్య తిరస్కరిస్తూ వస్తోంది. మంగళవారం మధ్యాహ్నం నవ్య తన ఫ్రెండ్ తో కలిసి స్థానికంగా ఉన్న ఫారెస్ట్ పార్కుకు వెళ్లింది. రోహిత్ కూడా పార్కుకు వచ్చి మాట్లాడాలి అంటూ నవ్యను పక్కకు తీసుకువెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ముఖం, గొంతు, కాలిపై కత్తితో గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యాడు.
నవ్య మిత్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం నవ్య ఆరోగ్య పరిస్థితినిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి రోహిత్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.