సినీ నిర్మాత దారుణ హత్య.. సికింద్రాబాద్లో ఘటన

సినీ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాతను చంపిన రవి కాట్రగడ్డను పోలీసులు అదుపు తీసుకున్నారు.

By అంజి  Published on  4 Oct 2023 8:46 AM IST
film producer, brutally murder, Secunderabad, Crime news

సినీ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్య.. సికింద్రాబాద్లో ఘటన

సినీ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాతను చంపిన రవి కాట్రగడ్డను పోలీసులు అదుపు తీసుకున్నారు. నిర్మాత ఆస్తుల కోసమే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్మాతను చంపిన రవి కాట్రగడ్డ.. ఆ తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. నిందితుడు రవి కమర్షియల్ కాంప్లెక్స్ లోని బేస్‌మెంట్‌లో నిర్మాతను చంపి పడవేశాడు. ఇద్దరు బిహారీలతో కలిసి నిర్మాత అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిర్మాత పేరు మీద ఉన్న పలు భవనాలు కాజేసేందుకే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఆస్తులను అమ్మి అమెరికాకు వెళ్ళిపోవాలని నిర్మాత ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే ఆస్తులను అమ్మే పని రవికి అప్పజెప్పాడు. దుర్బుద్ధి గల నిందితుడు రవి ఆస్తులు అన్నింటిని తన పేరు మీద రాయించుకొని నిర్మాతను హత్య చేశాడు. ఇద్దరు బిహారీలకు సుపారీ ఇచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుని అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story