బాలిక విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ని కత్తితో పొడిచి చంపేశాడు

A fight for a girl.. A young man stabbed a friend to death. ఢిల్లీలోని మల్కా గంజ్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవలో ప్రిన్స్ అనే

By అంజి  Published on  12 Sept 2022 2:00 PM IST
బాలిక విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ని కత్తితో పొడిచి చంపేశాడు

ఢిల్లీలోని మల్కా గంజ్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవలో ప్రిన్స్ అనే 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో బాధితుడి సోదరుడు 21 ఏళ్ల మిహిర్ కూడా గాయపడ్డాడు. నిందితుడు సిద్ధార్థ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మల్కా గంజ్‌లో నివాసం ఉంటున్న మిహిర్, అతని సోదరుడు ప్రిన్స్‌ను వారి బంధువు నితేష్ కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేర్చినట్లు ఆదివారం రాత్రి 11.20 గంటలకు హిందూరావు ఆసుపత్రి నుండి పోలీసులకు సమాచారం అందింది.

అధికారులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ప్రిన్స్ చికిత్స సమయంలో మరణించినట్లు ప్రకటించారు. అతని సోదరుడు మిహిర్ చికిత్స పొందుతున్నాడు. మృతుడి బంధువుని పోలీసులు విచారించారు. బాధితుడు ఉన్న ప్రాంతంలోనే నివసించే అతని స్నేహితుడు సిద్ధార్థ్ చేత కత్తిపోటుకు గురైనట్లు అధికారులు గుర్తించారు. రాత్రి 8.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక బాలిక విషయంలో వారి మధ్య వాగ్వాదం జరగడంతో నిందితుడు సిద్ధార్థ్.. ప్రిన్స్‌ని, అతని సోదరుడిని చాలాసార్లు కత్తితో పొడిచాడు.

నిందితుడిపై చట్టపరమైన చర్యలను పోలీసులు ప్రారంభించారు. ఘటనా స్థలానికి క్రైమ్ టీమ్‌ను కూడా రప్పించారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా సేకరించి, పరారీలో ఉన్న నిందితుడి కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. తదుపరి విచారణలు కొనసాగుతోంది.

Next Story