తోటి విద్యార్థినులను వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి
స్కూల్‌లో తోటి విద్యార్థినులను వేధించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తన కొడుకుకి విషమిచ్చి చంపేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 10:16 AM ISTతోటి విద్యార్థినులను వేధిస్తున్నాడని కొడుకుని చంపిన తండ్రి
మొబైల్ ఫోన్ల వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో.. వాటిని ఎక్కువగా వాడటం ద్వారా అంతే రేంజ్‌లో దుష్ప్రయోజనాలు ఉన్నాయి. స్కూల్ విద్యార్తుల నుంచే ఇప్పుడు సెల్‌ఫోన్లు వాడేస్తున్నారు. మంచి కోసం ఉపయోగిస్తే ఏం కాదు కానీ.. కొందరు ఆకతాయిలు చెడు దారుల్లో వాడుతున్నారు. అశ్లీల చిత్రాలు చూడటంతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. అయితే.. మహారాష్ట్రలో కూడా ఓ 14 ఏళ్ల కుర్రాడు అశ్లీల చిత్రాలు చూశాడు. అంతేకాక.. స్కూల్‌లో తోటి విద్యార్థినులను వేధించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఏకంగా తన కన్న కొడుకు అని కూడా చూడకుండా విషమిచ్చి చంపేశాడు.
జనవరి 13న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయ్ బట్టు అనే వ్యక్తి మిషన్ కుడుతూ మహారాష్ట్రోని షోలాపూర్‌లో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి విశాల్ అనే 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతను నివాసానికి దగ్గర్లో ఉన్న ఓ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. రోజూ స్కూల్‌కు ఫోన్ తీసుకెళ్లి.. అక్కడ అశ్లీల చిత్రాలను చూడసాగాడు. అంతటితో ఆగకుండా స్కూల్‌లోని బాలికలను వేధించాడు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు తండ్రికి చెప్పారు. తండ్రి కూడా కొడుకును పలుమార్లు మందలించాడబు. తిట్టాడు.. ఇలా చేయొద్దంటూ చెప్పాడు. కానీ.. కొడుకు తీరులో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో విసిగెత్తిపోయాడు తండ్రి విజయ్.
జనవరి 13న తన కొడుకుని బైక్‌పై తీసుకుని తుల్జాపూర్ రోడ్డుకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఒక కూల్‌డ్రింగ్ కొన్నాడు. విశాల్‌కు ఇచ్చే ముందే అందులో విషయం కలిపాడు. దాన్ని తాగిన విశాల్ కాసేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత కొడుకు బాడీని అక్కడ దగ్గర్లో ఉన్న మురికి కాలువలో పడేసి వెళ్లిపోయాడు. ఇక సాయంత్రం భార్యతో కలిసి విజయ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన కొడుకు విశాల్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మురికి కాల్వలో మృతదేహం లభించింది. విచారణలో భాగంగా తండ్రి విజయ్ నేరాన్ని అంగీకరించాడు. దాంతో.. పోలీసులు విజయ్‌పై హత్య కేసు నమోదు చేశారు.