హైదరాబాద్‌లో దారుణం.. ఇంట్లో నుంచి దుర్వాసన.. తలుపు తెరిచి చూసేసరికి

A family of four committed suicide in an unfortunate incident in Hyderabad. హైదరాబాద్‌లో విషాదకర సంఘటన జరిగింది. నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on  17 Oct 2022 11:34 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. ఇంట్లో నుంచి దుర్వాసన.. తలుపు తెరిచి చూసేసరికి

హైదరాబాద్‌లో విషాదకర సంఘటన జరిగింది. నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు తన భార్య సుజాత, కుమార్తె రమ్యశ్రీ, కుమారుడు టిల్లుతో కలిసి చందా నగర్‌లోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ నంబర్ 18లో గత ఏడేళ్లుగా నివసిస్తున్నారు. శుక్రవారం నుంచి వీరి ఇంటి తలుపులు మూసి ఉన్నాయని స్థానికులు సమాచారం అందించారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు వీరంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా పిల్లలు తాగించి ఆ తర్వాత దంపతులు కూడా తాగారు. ఇంట్లోనే మృతి చెందారు.

సోమవారం ఉదయం నాగరాజు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో తలుపులు తట్టారు. ఎంతసేపటికి కూడా తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టారు. నాగరాజు, అతని కుటుంబ సభ్యులు మృతి చెందడం చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story