వరుసకి కూతురితో ప్రేమ వ్యవహారం.. జంట ఆత్మహత్య
చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాద ఘటన జరిగింది. మైనర్ బాలికతో ప్రేమాయణం బట్ట బయలు అయిందని మనస్తాపంతో ఇద్దరు ప్రేమికులు
By అంజి Published on 18 Jun 2023 9:51 AM ISTవరుసకి కూతురితో ప్రేమ వ్యవహారం.. జంట ఆత్మహత్య
చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాద ఘటన జరిగింది. మైనర్ బాలికతో ప్రేమాయణం బట్ట బయలు అయిందని మనస్తాపంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పుంగనూరు మండలం చింపరపల్లె అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక ఎస్సై మోహన్ కుమార్ తెలిపారు. పుంగనూరు కర్ణాటక సరిహద్దులో శనివారం ఉదయం సుమారు 11 గంటలకు చింపరపల్లి అటవీ ప్రాంతంలో గంగయ్య (35), నక్షత్ర (15)లు ఇరువురు ఒకే చెట్టుకొమ్మకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన గంగయ్య, నక్షత్రలు పుంగనూరు టౌన్ ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గంగయ్య కు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే గంగయ్య తన మరదలు కూతురితో గత కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో గత వారం రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై పోలీస్టేషన్‌లో ఇరు కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ జరిగింది.
ఆ తర్వాత గంగయ్య, నక్షత్రలు దూరంగా ఉండాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మనస్తాపం చెందిన గంగయ్య, నక్షత్రలు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు ముందు తన అన్నకి ఫోన్ చేసిన గంగయ్య.. తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. కాగా మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇరు కుటుంబాల రోదనలతో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణం దుఃఖమయం అయ్యింది.