అక్రమ భూదందా కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు బుక్ అయ్యింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరించి గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి, కొట్టి 60 లక్షలనగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లుగా బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కన్నరావు మీద కేసు నమోదు చేశారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కన్నారావు సహా మరో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నందిని అనే మహిళతో కలిసి కన్నారావు ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
ఓ సమస్య పరిష్కారం కోసం విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నారావు దగ్గరకు వెళ్లాడు. కన్నారావుకుకు తెలిసిన నందిని.. విజయవర్ధన్ వద్ద నగలు, నగదు ఉన్నాయనే విషయం తెలుసుకుంది. ఈ విషయం కన్నారావుకు చెప్పింది. ఆ మహిళతో పాటు మరికొంత మందితో కలిసి కన్నారావు తనను బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు పోలీసు ఉన్నతాధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసు అంటూ బెదిరించారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.