కారుతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడి బీభత్సం

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. బోధన్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సోహెల్‌ ఈ కారు నడిపినట్లు పోలీసులు తేల్చారు.

By అంజి  Published on  26 Dec 2023 6:55 AM GMT
BRS MLA, Praja Bhavan, Shakeel Ahmed Son, Crime news

కారుతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడి బీభత్సం

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. బోధన్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సోహెల్‌ ఈ కారు నడిపినట్లు పోలీసులు తేల్చారు. కారు ప్రమాదానికి గురైన వెంటనే సోహెల్‌ అక్కడి పారిపోయాడు. ఆ తర్వాత కేసు తప్పుదోవ పట్టించేందుకు వేరే వ్యక్తి కారు డ్రైవ్‌ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిసెంబరు 24, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో, TS13 ET 0777 రిజిస్ట్రేషన్ నంబర్ గల BMW కారు ట్రాఫిక్ బారికేడ్‌ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది.

ప్రజా భవన్ వద్ద జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందుతులను గుర్తించామని వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. కారు నడిపింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌ అని తెలిపారు. ప్రస్తుతం రాహిల్ పరారీలో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాహిల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయి, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నడిపింది రాహిల్‌ అని నిర్ధారించుకున్నామని తెలిపారు.

ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామని, ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని డీసీపీ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్‌ను అతివేగంగా వచ్చి బీఎమ్ డబ్ల్యూ కార్ ఢీ కొట్టింది. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని డీసీపీ తెలిపారు. రాహిల్‌పై గతంలో ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదు అయ్యిందని, ఆ కేసును కూడా దర్యా

Next Story