ఎంతకి తెగించావమ్మా..ప్రియుడి కోసం కట్టుకున్నోడికి కరెంట్ షాక్ ఇచ్చి హత్య
ఢిల్లీకి చెందిన కరణ్ దేవ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది.
By Knakam Karthik
ఎంతకి తెగించావమ్మా..ప్రియుడి కోసం కట్టుకున్నోడికి కరెంట్ షాక్ ఇచ్చి హత్య
దేశంలో భార్యల చేతిలో హత్యలకు గురవుతున్న భర్తల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. తాజాగా ఢిల్లీకి చెందిన కరణ్ దేవ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. కరణ్ కు వరుసకు సోదరుడయ్యే రాహుల్ కు దగ్గరైన ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడు రాహుల్ నుంచి ఇన్‌స్టా చాటింగ్‌లో సలహాలు తీసుకుంటూ భర్త ప్రాణాలు తీసింది. మృతుడి సోదరుడు కునాల్ దేవ్ పోలీసులకు ఇచ్చిన ఓ వీడియోలో నిందితుల చాట్స్ వెలుగులోకి వచ్చాయి.
ఆ చాటింగ్స్ చూస్తే వాళ్లు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతోంది. ముందుగా సుష్మిత రాహుల్‌కు పంపిన చాట్‌లో ‘నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో ఒకసారి చెక్ చెయ్. అతడు నిద్రమాత్రలు కలిపిన అన్నం తిని మూడు గంటలు అయ్యింది. ఇంతవరకు వాంతులు లేవు. స్పృహ కోల్పోలేదు. ఏమి కావడం లేదు. ఇంకా చావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం. ఏదో ఒక ఉపాయం చెప్పు’ అని అడిగింది.
అందుకు రాహుల్ బదులిస్తూ.. ‘అయితే అతడిపై నిద్రమాత్రల ప్రభావం కనిపించకపోతే కరెంట్ షాక్ పెట్టు’ అని పేర్కొన్నాడు. అందుకే సుష్మిత ‘షాక్ ఎలా పెట్టాలి’ అని అడిగింది. దాంతో రాహుల్ ‘టేప్ తో’ అని బదులిచ్చాడు. ఆ తర్వాత ‘ఆయన నిదానంగా శ్వాస తీసుకుంటున్నాడు’ అని సుష్మిత పేర్కొంది. ‘అయితే నీ దగ్గర ఉన్న అన్ని మెడిసిన్ అతడికి వేసెయ్’ అని రాహుల్ సూచించాడు.
ప్రతిగా సుష్మిత ‘అతడి నోరు తెరవడం నావల్ల కావడంలేదు. అతడి నోట్లో నీళ్లయితే పోయగలను. కానీ మెడిసిన్ వేయలేను. నువ్వు ఇక్కడికి రా. ఇద్దరం కలిసి అతడికి మెడిసిన్ వేయొచ్చేమో’ అని పేర్కొంది. ఆ తర్వాత రాహుల్ సూచన మేరకు కరెంట్ షాక్ పెట్టి చంపింది. అతడు తీసుకున్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపినట్లు పోస్టుమార్టంలో తేలడంతో బండారం బయటపడింది. సుష్మిత, ఆమె ప్రియుడు రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.