అనకాపల్లిలో దారుణం.. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం.. ఏం జరిగిందంటే?

A 34-year-old woman was raped and murdered in SEZ premises of Anakapalli district. ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సెజ్ ఆవరణలో 34 ఏళ్ల మహిళపై

By అంజి  Published on  19 Sept 2022 2:16 PM IST
అనకాపల్లిలో దారుణం.. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం.. ఏం జరిగిందంటే?

ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సెజ్ ఆవరణలో 34 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగినప్పటికీ పొదల్లో మహిళ మృతదేహం లభ్యం కావడంతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లలను తమ బంధువుల ఇంటి వద్ద వదిలి జీవనోపాధి కోసం మహిళ, ఆమె భర్త అచ్యుతాపురం వచ్చారని పోలీసులు తెలిపారు.

మృతురాలి భర్త సెజ్‌లోని ఆర్‌సీఎల్‌ కంపెనీలో రోజువారీ వేతన కార్మికుడు, ఆమె వంటమనిషిగా పనిచేసింది. వారు కంపెనీకి సమీపంలో ఒక చిన్న షెడ్‌లో నివసించారు. అక్కడ పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొంతమంది కార్మికులు కూడా ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం భర్త ఉద్యోగానికి వెళ్లగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కూలీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

ఆమె ప్రతిఘటించి ఉండవచ్చని, ఆ వ్యక్తి ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడేసి ఉంటాడని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సూడాన్ సర్కార్‌ అనే కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story