13 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం.. అప్పు చెల్లించలేదని..

A 13-year-old girl was raped by an old man for not paying the loan taken. ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని

By అంజి  Published on  30 Jan 2023 2:47 AM GMT
13 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం.. అప్పు చెల్లించలేదని..

ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని మైనర్‌ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేశాడు. మూడు నెలల పాటు బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కురుద్‌ పీఎస్‌ పరిధిలో తల్లి, 13 ఏళ్ల బాలిక నివసిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో అవసరం మేరకు పక్కనే నివాసం ఉంటున్న వృద్ధుడి నుంచి బాలిక తల్లి 5 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది.

అప్పటి నుంచి తన డబ్బు తిరిగి ఇవ్వాలని బాలిక తల్లిని వృద్ధుడు బలవంతం చేశాడు. అయితే ఆమె అప్పు తిరిగి చెల్లించకపోవడంతో నిందితుడు ఆమె మైనర్ కుమార్తెపై మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. తన కూతురు మూడు నెలలుగా గర్భవతి అని తెలియడంతో తల్లి ఫిర్యాదు చేసినట్లు కురుద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రణాలి వైద్య తెలిపారు. పోలీసు అధికారి ఇంకా మాట్లాడుతూ.. నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచామని, అక్కడ నుండి అతను జ్యుడీషియల్ రిమాండ్‌పై జైలుకు పంపబడ్డాడని తెలిపారు.

అంతకుముందు శనివారం నాడు మహారాష్ట్రలోని థానే జిల్లాలో 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు పోలీసులమని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కళ్యాణ్ తాలూకాలోని డోంబివిలి పట్టణంలోని క్రీక్ దగ్గర మైనర్ బాలిక తన ప్రియుడితో కలసి షికారు చేస్తుండగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారి తెలిపారు. నిందితులు తమను తాము పోలీసులమని చెప్పుకుంటూ ఆ ప్రాంతంలో సంచరించవద్దని వారిద్దరినీ కోరినట్లు తెలిపారు. యువకులు బాలికను క్రీక్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు ఈ చర్య యొక్క వీడియోను చిత్రీకరించారు. దానిని ప్రసారం చేస్తానని బెదిరించినట్లు అధికారి తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Next Story