బస్సు, ఆటో ఢీ.. 9 మంది దుర్మరణం
9 Killed In Head-On Collision Between Bus And Auto In Bengal's Birbhum.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2022 6:42 AM ISTపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటోరిక్షా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. బీర్భూమ్ జిల్లాలో మల్లార్‌పూర్‌లోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 8 మంది మహిళా కూలీలు ఉన్నారు.
West Bengal | 9 people killed in auto and bus collision in Mallarpur police station area of Birbhum district: Dhiman Mitra, SDPO Rampurhat pic.twitter.com/dqPmhhZves
— ANI (@ANI) August 9, 2022
బీర్భూమ్ జిల్లా ఎస్పీ నాగేంద్ర నాథ్ త్రిపాఠి మాట్లాడుతూ.. మహిళలు వరి పొలం నుంచి ఇంటికి వెలుతుండగా ఈ ప్రమాదం జరిందన్నారు. ప్రమాద సమయంలో ఆటోరిక్షా లో ఎనిమిది మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, ఆటో రిక్షా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న దక్షిణ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎస్‌బిఎస్‌టిసి) బస్సును ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో మహిళలతో పాటు ఆటో డ్రైవర్ కూడా మృతి చెందాడని తెలిపారు. మృతదేహాలను ఆరంబాగ్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ప్రధాని మోదీ సంతాపం..
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్గేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 చొప్పున అందించనున్నారు.
Anguished by the loss of lives due to a tragic accident in Birbhum district of West Bengal. Prayers with the injured.
— PMO India (@PMOIndia) August 9, 2022
Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased and the injured would be given Rs. 50,000: PM @narendramodi