పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తన భర్త మహిళ అని తెలియడంతో.. భార్య షాక్‌

8 years after marriage, wife finds out that husband was earlier a woman. గుజరాత్‌లోని వడోదరలో ఒక మహిళ తన భర్త అంతకుముందు స్త్రీ అని, అతనిని వివాహం చేసుకున్న ఎనిమిదేళ్ల

By అంజి  Published on  16 Sep 2022 5:52 AM GMT
పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత.. తన భర్త మహిళ అని తెలియడంతో.. భార్య షాక్‌

గుజరాత్‌లోని వడోదరలో ఒక మహిళ తన భర్త అంతకుముందు స్త్రీ అని, అతనిని వివాహం చేసుకున్న ఎనిమిదేళ్ల తర్వాత గుర్తించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వడోదరకు చెందిన 40 ఏళ్ల మహిళ 2014లో తనను పెళ్లాడిన వ్యక్తి పురుషుడిగా మారేందుకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడని, ఆ విషయాన్ని తన నుంచి దాచిపెట్టాడని గోత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో మహిళగా నటించిన భర్త డాక్టర్ విరాజ్ వర్ధన్‌పై మోసం, అసహజ శృంగారం ఫిర్యాదును ఆమె దాఖలు చేసింది. బుధవారం గోత్రి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లో తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా నమోదు చేసింది.

గతంలో వివాహం చేసుకుని, 14 ఏళ్ల కుమార్తె ఉన్న బాధితురాలు.. ఢిల్లీకి చెందిన నిందితుడిని తొమ్మిదేళ్ల క్రితం మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కలిశానని పోలీసులకు తెలిపింది. ఆమె మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 2014 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో లాంఛనంగా వివాహం చేసుకుని హనీమూన్‌కు కాశ్మీర్‌కు వెళ్లారని, అయితే ఆ వ్యక్తి భార్యను దగ్గరకు తీసుకోలేదని, చాలా రోజులు సాకులు చెబుతూనే వచ్చాడని పోలీసులు తెలిపారు. అతను కొన్నేళ్ల క్రితం రష్యాలో ఉన్నప్పుడు అతను ఎదుర్కొన్న ప్రమాదం తనను శృంగారం చేయకుండా చేసిందని, మహిళ ఒత్తిడి చేయడంతో ప్రమాదం జరిగిందని చెప్పాడని పోలీసులు తెలిపారు.

మైనర్ సర్జరీ చేస్తే బాగుంటుందని నిందితుడు మహిళకు చెప్పాడు. జనవరి 2020లో అతను తన బరువును తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పాడు. చికిత్స కోసం కోల్‌కతా వెళ్లాడు. అయితే.. అతను తరువాత నిజాన్ని వెల్లడించాడు. మగ అవయవాలను అమర్చడానికి తాను లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకున్నానని చెప్పాడు. శస్త్ర చికిత్స గురించి తనకు ఎలాంటి వివరాలు చెప్పలేదని మహిళ చెప్పింది. అతను తనతో "అసహజ శృంగారం" చేయడం ప్రారంభించాడని, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది.

నిందితుడు తన పేరు మీద రూ.90 లక్షలు అప్పు తీసుకుని తన కాలనీలో ఫ్లాట్ కూడా కొన్నాడని మహిళ ఆరోపించింది. ఢిల్లీ నివాసి అయిన నిందితుడిని వడోదరకు తీసుకువచ్చినట్లు గోత్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంకే గుర్జర్ తెలిపారు.

Next Story