బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి.. వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో..

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో 70 ఏళ్ల దుకాణదారుడు దళిత బాలికపై లైంగిక వేధింపుల వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  5 Sept 2024 7:23 AM IST
shopkeeper, sexually assaulted, minor girl, UP, Sitapur, arrest

బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి.. వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో..

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో 70 ఏళ్ల దుకాణదారుడు దళిత బాలికపై లైంగిక వేధింపుల వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం బాలిక నిందితుడి దుకాణానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు మహ్మద్ అన్వర్‌ను అరెస్టు చేశారు.

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంఘటనకు సంబంధించిన వీడియోలో, వృద్ధుడు మైనర్ బాలికను అనుచితంగా తాకాడు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సంబంధిత నిబంధనల కింద అన్వర్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ సీతాపూర్ ప్రకాష్ కుమార్ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం..

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఇదే తరహాలో మానసిక ఆరోగ్య పరిస్థితితో జీవిస్తున్న మహిళపై ముగ్గురు బంధువులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ అధికారి బుధవారం తెలిపారు. దాభ్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో సోమవారం ఈ నేరం జరిగిందని, మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్న మహిళను నిర్జన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని అధికారి తెలిపారు.

పాఠశాల ఆవరణలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి

ఉత్తరప్రదేశ్‌లోని మరో ఘటనలో నోయిడాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగిందని సెక్టార్-24 పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ ధ్రువ్ భూషణ్ దూబే తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా ఓ కూలీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం బాలిక తన ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో పాటు ప్రిన్సిపాల్‌కు కూడా సమాచారం అందించారు. అయితే పాఠశాల యాజమాన్యం విషయాన్ని అటకెక్కించే ప్రయత్నం చేసిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story