మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు మృతి

7 People dead after drinking hand sanitizer.వైన్ షాపులు మూత‌ప‌డ‌డంతో మ‌ద్యం దొర‌క్క మందుబాబులు శానిటైజ‌ర్ కొనుక్కుని తాగుతున్నారు. శానిటైజ‌ర్ తాగిన ఘ‌ట‌న‌లో ఏడుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2021 7:50 AM GMT
Sanitizer drinking

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుక‌ట్ట‌వేసేందుకు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో నిత్యావ‌స‌ర స‌రుకులు అమ్మే దుకాణాలు, ఆస్ప‌త్రులు, మెడిక‌ల్ షాపులు మిన‌హా అన్ని మూత‌ప‌డ్డాయి. వైన్ షాపులు మూత‌ప‌డ‌డంతో మ‌ద్యం దొర‌క్క మందుబాబులు శానిటైజ‌ర్ కొనుక్కుని తాగుతున్నారు. శానిటైజ‌ర్ తాగిన ఘ‌ట‌న‌లో ఏడుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న యావ‌త్మ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. యావత్మల్ జిల్లా వానీ గ్రామంలో కొందరు కూలీలు మద్యానికి బానిసయ్యారు. లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడా మద్యం దొరక‌డం లేదు. శానిటైజర్​లో 70 శాతం మద్యం ఉంటుందని ఎవరో సమాచారం ఇచ్చారని లాయర్ దీపక్ ఆరోపించారు. దీంతో వారంతా ఐదు లీటర్ల శానిటైజర్ కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఆ త‌రువాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ‌ప‌డుతుండ‌గా.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఏడుగరు మరణించారు. మృతులను దత్త లాంజేవర్, నూతన్ పతారత్కర్, గణేష్ నందేకర్, సంతోష్ మెహర్, సునీల్‌గా గుర్తించారు.




Next Story