ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం

ముంబైలోని రెండంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు.

By అంజి  Published on  6 Oct 2024 11:24 AM IST
Mumbai, Family Die, Short Circuit, Fire

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం 

ముంబైలోని రెండంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. చెంబూరులోని సిద్ధార్థ్‌ కాలనీలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణంలో మంటలు ప్రారంభమై పై అంతస్తుకు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న కుటుంబం అగ్నికి ఆహుతైంది అధికారులు తెలిపారు.

చనిపోయిన వాళ్లను పరిస్ గుప్తా 7, నరేంద్ర గుప్తా 10, మంజు ప్రేమ్ గుప్తా, 30, అనితా గుప్తా, 39, ప్రేమ్ గుప్తా, 30, విధి గుప్తా, గీతా గుప్తాగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Next Story