విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత

7 Girls Drown in Jharkhand Pond During 'Karma Puja' Immersion.జార్ఖండ్‌ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కర్మపూజ

By అంజి  Published on  19 Sep 2021 2:34 AM GMT
విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత

జార్ఖండ్‌ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కర్మపూజ కోసం వెళ్లిన ఏడుగురు బాలికలు.. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన లతేహార్ జిల్లాలో జరిగింది. బాలుమత్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షేరెగాడలోని బక్రు గ్రామంలో 10 మంది బాలికలు స్థానిక గిరిజన పండుగైన కర్మపూజను జరుపుకునేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఇద్దరు బాలికలు సహాయం కోసం కేకలు వేయగా.. మరో ఐదుగురు బాలికలు వారిని రక్షించేందు నీట మునిగారని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలో నలుగురు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు బాలికలను బాలుమత్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.

చనిపోయిన వారిలో రేఖ కుమారి (18), రీనా కుమారి (16), లక్ష్మీ కుమారి (12)లు సొంత అక్కా చెల్లెలు. మృతి చెందిన మరో నలుగురు బాలికలు బసంతి కుమారి (12), సునీతా కుమారి (20), పింకు కుమారి (18), సుష్మా కుమారి (12)లు అధికారులు గుర్తించారు. మృతి చెందిన బాలికలు స్థానిక పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్నారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్, స్థానిక ఎంపీ సునీల్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతేహార్ జిల్లా షెరెగాడలో కర్మపూజలో మృతి చెందిన బాలికల ఆత్మకు శాంతిని ప్రసాదించాలని, బాధిత కుటుబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని పార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Next Story