దారుణం.. మైనర్ బాలికపై వృద్దుడి అఘాయిత్యం
65 Year old Man Rapes minor girl in Medak.ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 8 Oct 2021 2:26 PM ISTఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట కామాంధులు మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అభం, శుభం తెలియని చిన్నారులను సైతం వదలడం లేదు. టీవీ చూడడానికి వచ్చే మైనర్ బాలికపై ఓ వృద్దుడు కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి గత కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బాలిక గర్భవతి అని తెలిసింది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిజాంపేట మండలం నార్లాపూర్ లో 65 ఏళ్ల వృద్దుడు నివసిస్తున్నాడు. అతడి ఇంట్లో టీవీ చూడడానికి ఓ 17 ఏళ్ల బాలిక వెలుతుండేది. మైనర్ బాలిక పై కన్నేసిన వృద్దుడు బాలికకు మాయమాటలు చెప్పి గత కొద్ది నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఇటీవల బాలిక అస్వస్థతకు గురికావడంతో.. బాలికను ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీయగా.. బాలిక అసలు నిజం చెప్పింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు నిజాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.