అన‌కాప‌ల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలిక‌పై అత్యాచారం..!

6 Years old girl moslated by Neighbor.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2022 9:25 AM IST
అన‌కాప‌ల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలిక‌పై అత్యాచారం..!

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. కామంతో క‌ళ్లు మూసుకుపోతున్న కామాంధులు వావి- వ‌రుస‌లు, చిన్నా-పెద్దా చూడ‌డం లేదు. ఆరేళ్ల బాలిక‌ త‌న సోద‌రితో క‌లిసి అర్థ‌రాత్రి బ‌హిర్భూమికి వెళ్ల‌గా.. ఓ వ్య‌క్తి బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌టన ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

అన‌కాప‌ల్లి జిల్లాలో ఆరేళ్ల బాలిక త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. అర్థ‌రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో అక్కాచెల్లెలు బహిర్భూమికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఓ దుండ‌గుడు ఆరేళ్ల బాలిక‌ను ప‌క్క‌కు లాక్కెళ్లాడు కాగా..ఎవ‌రో చెల్లిని ఎత్తుకుపోతున్నార‌ని మ‌రో బాలిక వ‌చ్చి త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. వెంట‌నే వారు చుట్టుప‌క్క‌ల మొత్తం వెతుక‌క‌గా.. ఓ చోట తీవ్ర ర‌క్త‌స్రావంతో అప‌స్మార‌క‌స్థితిలో బాలిక క‌నిపించింది. వెంట‌నే బాలిక‌ను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సాయి అనే వ్య‌క్తి బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు బాలిక త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు బాలిక త‌ల్లిదండ్రులు. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story