అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక.. దెయ్యం పట్టిందని కొట్టి చంపిన తల్లిదండ్రులు

6 Year old Girl murdered by her parents due to superstition. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సుభాష్‌ నగర్‌లో మూఢనమ్మకాల కారణంగా

By అంజి  Published on  7 Aug 2022 8:42 PM IST
అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక.. దెయ్యం పట్టిందని కొట్టి చంపిన తల్లిదండ్రులు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సుభాష్‌ నగర్‌లో మూఢనమ్మకాల కారణంగా తల్లిదండ్రులు తమ ఆరేళ్ల బాలికను హత్య చేశారు. ఇద్దరినీ నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని తరిమేందుకు దొంగ బాబా సలహా మేరకే తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. బాలిక తండ్రి చిమ్నే యూట్యూబ్‌లో స్థానికంగా న్యూస్ ఛానెల్ నడుపుతున్నాడు.

గత నెల గురుపూర్ణిమ సందర్భంగా భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి తకల్‌ఘాట్‌ ప్రాంతంలోని దర్గాకు వెళ్లాడు. అప్పటి నుండి బాలిక అనారోగ్యం బారిన పడ్డది. బాలిక కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎన్ని మెడిసన్స్‌ వాడినా బాలిక కోలుకోలేదు. ఆమెకు దెయ్యం పట్టిందని భావించిన తల్లిదండ్రులు ఓ దొంగ బాబాను సంప్రదించారు. బాబా దగ్గర ఏవో పూజలు చేశారు. ఇంటి దగ్గర కూడా రకరకాల పూజలు చేశారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదని బాలికను, ఆమె తండ్రి, అత్త కలిసి కర్రతో, బెల్టుతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాలిక అకడికక్కడే కుప్పకూలింది.

వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బాలిక అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు.. మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతికి కారణమైన ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా పరారీలో ఉన్న దొంగ బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను బాలిక తండ్రి సిద్ధార్థ్ చిమ్నే (45), తల్లి రంజన (42), అత్త ప్రియా బన్సోద్ (32)గా గుర్తించారు.

Next Story