ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీని ట్రక్కు ఢీకొట్టడంతో 6 మంది మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. ఆదివారం అర్థరాత్రి జిల్లాలోని గుండర్‌దేహి ప్రాంత నివాసితులు కుటుంబ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా దౌండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఎస్‌యూవీ వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న 13 మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను దుర్పత్ ప్రజాపతి (30), సుమిత్రా బాయి కుంభకర్ (50), మనీషా కుంభకర్ (35), సగున్ బాయి కుంభకర్ (50), ఇమ్లా బాయి (55), మైనర్ బాలుడు జిగ్నేష్ కుంభకర్ (7)గా గుర్తించారు. ఐదుగురు మహిళలు, ఒక బిడ్డతో సహా గాయపడిన ఏడుగురిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిచారు. అక్కడి నుండి వారిని తదుపరి చికిత్స కోసం రాజ్‌నంద్‌గావ్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు తదుపరి విచారణ కొనసాగుతోంది.