ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి ట్ర‌క్కును ఢీ కొట్టిన బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

6 Killed In Bus Truck Collision At Vadodara National Highway. ఓవ‌ర్ టేక్ చేసే క్ర‌మంలో బ‌స్సు అదుపు త‌ప్పి ట్ర‌క్కును ఢీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Oct 2022 12:00 PM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి ట్ర‌క్కును ఢీ కొట్టిన బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఓవ‌ర్ టేక్ చేసే క్ర‌మంలో ల‌గ్జ‌రీ బ‌స్సు అదుపు త‌ప్పి ట్ర‌క్కును ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ణం చెందారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలోని వ‌డోద‌రాలో జ‌రిగింది.

రాజ‌స్థాన్‌లోని బిల్వారా నుంచి ప్ర‌యాణీకుల‌తో ల‌గ్జ‌రీ బ‌స్సు ముంబై వెలుతోంది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున వ‌డోర క‌పురై బ్రిడ్జి వ‌ద్ద ముందు వెలుతున్న ట్ర‌క్‌ని ఓవ‌ర్‌టేక్ చేసే క్ర‌మంలో అదుపు త‌ప్పి ఢీ కొట్టింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను వ‌డోద‌ర‌లోని సాయాజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లంలోనే న‌లుగురు మ‌ర‌ణించ‌గా.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story