హ్యాండ్ గ్లోవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు.

By అంజి  Published on  31 Dec 2023 11:24 AM IST
Massive Fire, Gloves Factory, Maharashtra, Aurangabad

హ్యాండ్ గ్లోవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం వరకు మంటలు అదుపులోకి వచ్చాయి.

"మధ్యాహ్నం 2:15 గంటలకు మాకు కాల్ వచ్చింది, మేము సైట్‌కు చేరుకున్నప్పుడు, ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో ఉంది. మా సిబ్బంది భవనంలోకి ప్రవేశించారు. ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం" అని అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు. రాత్రి కర్మాగారాన్ని మూసివేశారని, మంటలు చెలరేగిన సమయంలో తాము నిద్రిస్తున్నామని కార్మికులు తెలిపారు. ఆ సమయంలో దాదాపు 10-15 మంది భవనంలో చిక్కుకున్నారని స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story