కన్వర్ యాత్రలో విషాదం.. ట్ర‌క్కు ఢీ కొని ఆరుగురు మృతి

6 Dead after Kanwar devotees hit by truck in UP's Hathras.ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌న్వ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2022 11:09 AM IST
కన్వర్ యాత్రలో విషాదం.. ట్ర‌క్కు ఢీ కొని ఆరుగురు మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌న్వ‌ర్ యాత్రికుల‌పై నుంచి ట్ర‌క్కు దూసుకువెళ్లింది.ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు భ‌క్తులు మృతి చెందారు.


వివ‌రాల్లోకి వెళితే..మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్వాలియ‌ర్‌కు చెందిన భ‌క్తులు హ‌రిద్వార్ నుంచి త‌మ స్వ‌స్థ‌లానికి వెలుతుండ‌గా శ‌నివారం తెల్ల‌వారుజామున 2.15 గంట‌ల స‌మ‌యంలో హ‌త్రాస్‌లోని స‌దాబాద్ పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో ఓ ట్ర‌క్కు వీరిని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మ‌రో ఇద్ద‌రు వ్యక్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. చికిత్స పొందుతూ మ‌రో వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టామ‌ని, ట్ర‌క్ డ్రైవ‌ర్‌ను గురించి స‌మాచారం అందింద‌ని ఆగ్రా జోన్ అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కృష్ణ తెలిపారు. నిందితుడి త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌న్నారు.

ప‌విత్ర శ్రావ‌ణ మాసంలో గంగా న‌ది నీటిని తీసుకువ‌చ్చి దేవుడికి స‌మ‌ర్పించేందుకు శివుని భ‌క్తులు ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌, రిషికేశ్‌, గౌముఖ్, ఇత‌ర ప్ర‌దేశాల‌కు కాలిన‌డ‌క క‌న్వ‌ర్ యాత్ర సాగిస్తారు. కాగా.. గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ యాత్ర‌ను నిర్వ‌హించ‌లేదు. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇటీవ‌లే ఈ యాత్ర ప్రారంభ‌మైంది.

Next Story