విషాదం.. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి
5 Tribals die after drinking toddy in East Godavari District.తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ
By తోట వంశీ కుమార్ Published on
2 Feb 2022 9:49 AM GMT

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. రాజవొమ్మంగి మండలం లొదొడ్డి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు ఎప్పటిలాగే జీలుగు కల్లును తాగారు. అయితే.. కల్లు తాగిన అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని జడ్డంగి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.
మెరుగైన చికిత్స కోసం మిగతా వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా.. వారు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కల్లు శాంపిల్స్‌ను సేకరించి విచారణ చేపట్టారు. మృతులను గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవు, ఏసుబాబుగా గుర్తించారు. ఒకేసారి గ్రామంలో ఐదుగురు మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story