కంటైన‌ర్‌ను ఢీ కొట్టిన కారు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

5 Killed In Car Accident On Mumbai-Pune Highway.ముంబై-పూణె జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2022 11:07 AM IST
కంటైన‌ర్‌ను ఢీ కొట్టిన కారు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

ముంబై-పూణె జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కంటైన‌ర్ వాహ‌నాన్ని కారు వెనుక‌ నుంచి ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. పుణె నుంచి ఎర్టికా కారు ముంబై వెలుతోంది. గురువారం రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా కోప్లీ సమీపంలో కంటైన‌ర్ వాహ‌నాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో తొమ్మిది మంది ఉన్నారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మిగ‌తా వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. కాగా.. మృతి చెందిన వారంతా పురుషులేన‌ని, గాయ‌ప‌డిన వారిలో ఓ మ‌హిళ ఉన్న‌ట్లు ఖోపోలి పోలీస్ స్టేషన్ అధికారి ఒక‌రు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కారు డ్రైవర్‌ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డ్రైవర్‌పై నేరం నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story